Monday, January 20, 2025

విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదు: నామా

- Advertisement -
- Advertisement -

Nama nageswar rao comments on Modi

హైదరాబాద్: ఇన్నేళ్లుగా విభజన హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు నెరవేర్చాలని సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నో ఉత్తరాలు రాశారన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రమంత్రి అంటున్నారని, తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని, తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తుందన్నారు. జాతీయ రహదారుల భూసేకరణకు కేంద్రం తెలంగాణను డబ్బులు అడుగుతోందని, మిగతా రాష్ట్రాల్లో మాత్రం కేంద్రమే భరిస్తోందన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కిషన్ రెడ్డి ఏనాడైనా మాట్లాడారా? అని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News