- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో పెద్ద ఎత్తున వరద నష్టం జరిగినా కేంద్రం సాయం చేయడం లేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ లో వరద సమస్యలపై చర్చ జరిపాలని కోరితే టిఆర్‌ఎస్ ఎంపిలను సస్పెండ్ చేశారని. కేంద్ర ప్రభుత్వ తీరు అప్రజాస్వామికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు మోడీ ప్రభుత్వం భారీగా సాయం చేస్తోందని, తెలంగాణకు మాత్రం రూపాయి కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ డబ్బులను మోడీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఖర్చు పెడుతోందని నామా తెలియజేశారు. తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ అండగా ఉన్నారన్నారు.
- Advertisement -