Monday, December 23, 2024

మోడీకి బంధువు రాహుల్ గాంధీ: నామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీకి నామా రీకౌంటర్ ఇచ్చారు. బిజెపిపై పోరాటంలో బిఆర్‌ఎస్ వెనకడుగు వేయదన్నారు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలనే వైఖరి సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ పోరాటానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. రైతు చట్టాలపై లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు రాహుల్ గాంధీ సభలోనే లేరని చురకలంటించారు. బిజెపికి బంధువు బిఆర్‌ఎస్ కాదని, రాహులే బంధువని, ప్రధాని నరేంద్ర మోడీకి బంధువు కాబట్టే లోక్‌సభలో మోడీని రాహుల్ కౌగలించుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బిఆర్‌ఎస్ పోరాటానికి మద్దతు ఇచ్చిందా? అని అడిగారు.

Also Read: జితేందర్ రెడ్డి ఫాంహౌస్‌లో ఈటల, దత్తాత్రేయ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News