- Advertisement -
ఢిల్లీ: అదానీ కంపెనీ అవకతవకలతో ఎల్‌ఐసి, పేదలపై పెనుబారం పడుతుందని ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఆవరణంలో నామా మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జెపిసి, సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలన్నారు. బిఆర్‌ఎస్ అన్ని విపక్ష పార్టీలను సమన్వయం చేస్తుందన్నారు. అదానీ కంపెనీల మోసంపై చర్చ జరపాలని పార్లమెంట్ ఉభయసభల్లో బిఆర్‌ఎస్ ఎంపిలు, విపక్షాలు ఆందోళన చేపట్టాయి. లోక్‌సభ 2.30 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభ మ 2.30 గంటల వరకు వాయిదా పడింది.
- Advertisement -