Monday, January 20, 2025

విజయవంతంగా దూసుకుపోతున్న ‘నమస్తే సేట్‌జీ’

- Advertisement -
- Advertisement -

ఒక కిరాణా షాపు వ్యక్తి నేపథ్యంలో ‘నమస్తే సేట్‌జీ’ అనే సినిమాను నిర్మించామని ఆ సినిమా హీరో, దర్శకులు తల్లాడ సాయిక్రిష్ణ తెలిపారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పైన నిర్మించిన ఈ సినిమా విడుదలై హిట్ టాక్‌తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇందులో తల్లాడ సాయిక్రిష్ణ, స్వప్నా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా హీరో తల్లాడ సాయిక్రిష్ణ మాట్లాడుతూ “కరోనా సమయంలో నన్ను కలచి వేసిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తీశాను. కరోనా ఆంక్షలున్న సమయంలో మారుమూల గ్రామాల్లో కిరాణా షాపు యజమానులు అందించిన సహకారం మరువలేనిది”అని అన్నారు. సినిమా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ “కుటుంబ సమేతంగా చూసే సినిమా ఇది. ప్రతి కిరాణా షాపు వ్యక్తి ఈ సినిమా తప్పక చూడాలి”అని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News