Sunday, December 22, 2024

పేరుకే ’టీ’ పాయింట్ కానీ జోరుగా మద్యం అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

వర్ని: మండలం కేంద్రం పరిధిలోని ఆర్టిసి బస్సుల టర్నింగ్ వద్ద పేరుకే టీ పాయింట్ కాని ఆషాపులో జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా అయితే ప్రయాణికులకు ప్రమాదాలు జరగవా..? అని ప్రయాణికులు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ షాపులో నుంచి కొంత మంది మద్యం ప్రియులు మద్యం తాగి అక్కడ వెళ్లే ప్రజలకు ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తున్నారు.

దీంతో అక్కడి నుంచి బస్టాండ్‌లోకి మహిళ ప్రయాణికులు, ప్రజలు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి షాపులకు మద్యం ఎక్కడి నుంచి వస్తుందని ప్రజలు, ప్రయాణికులు ప్రశ్నిస్తునారు. సంబంధిత అధికారులు మద్యం సిట్టింగ్ షాప్‌లపై చర్యలు తీసుకోరా అని ప్రజలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆ టీ షాప్ యజమాని మద్యం అమ్మడం మానివేయడం లేదని ఆయనకు సంబంధిత అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ షాప్ వాళ్లు మేము నెలకు కిరాయి కడుతున్నామని తెలుపుతున్నారు.

ఎక్సైజ్ సిఐ చరవాణిలో మాట్లాడగా మేము టి పాయింట్లు మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఆ షాప్‌పై వెంటనే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News