- Advertisement -
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన భారత హాకీ ఆటగాళ్లకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా అరుదైన గౌరవం లభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టోక్యో క్రీడల్లో కాంస్యం సాధించిన హాకీ జట్టులో సభ్యులుగా ఉన్న పంజాబ్ ఆటగాళ్లకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. పంజాబ్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలకు హాకీ ఆటగాళ్ల పేర్లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో సహా పలువురు పంజాబ్ ఆటగాళ్ల పేర్లను ఆయా ప్రభుత్వ పాఠశాలలకు పెట్టాలని సిఎం అమరీందర్ సింగ్ నిర్ణయించారు. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
- Advertisement -