టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో నమీబియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టైగా ముగిసింది. తర్వాత సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇక సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పది పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. డేవిజ్ వీజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి నమీబియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్ ఓవర్‌లో వీజ్ బ్యాట్‌తోనూ చెలరేగాడు.
అతనికే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముంతు నిర్ణీత సమయంలో మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో నమీబియా బౌలర్లు సఫలమయ్యారు. ఒమన్ టీమ్‌లో కైల్ ఒక్కడే కాస్త రాణించాడు. కైల్ 24 పరుగులు చేశాడు. ఇక నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్ నాలుగు, వీజ్ మూడు, ఎరాస్మస్ రెండు వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నమీబియాను నిర్ణీత ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను టైగా ముగించింది. జాన్ ఫ్రైలింక్ (45), నికోలస్ డేవిస్ (24) రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.