Wednesday, January 22, 2025

కునో నేషనల్‌పార్కులో చీతా మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గతేడాది నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటి కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమవారం మరణించింది. కునో నేషనల్ పార్కులో చీతా ‘సాషా’ మరణించినట్లు అధికారులు తెలిపారు.అయితే సాషా భారత్‌కు తీసుకురాక ముందే కిడ్నీ సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో జనవరి 23న సాషాలో బలహీనత లక్షణాలు కనిపించడంతో దాన్ని ఎన్‌క్లోజర్‌లో ఉంచి వైద్యచికిత్స అందిస్తున్నారు.

మూడు సంవత్సరాలు వయసున్న సాషాను గతేడాది సెప్టెంబర్ 17న కునోలో ప్రవేశపెట్టారు. భారత్‌లో అంతరించిపోయిన చీతా జాతిని పునర్‌వృద్ధిలో భాగంగా భారత్‌కు తీసుకువచ్చారు. తొలుత వీటిని ఉంచి పరిశీలించిన అధికారులు అనంతరం సురక్షిత హంటింగ్ ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టారు. అప్పటినుంచి ణేనిమిది చీతాలు స్వయంగా వేటాడుతూ కొత్త నివాసానికి అలవాటుపడ్డాయి. కాగా త్వరలో మరో 12 చీతాలు రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News