- Advertisement -
ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మందికి పైగా రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందించే ఓ ఆర్థిక పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. నమో షేత్కారీ మహా సన్మాన్ యోజన పేరుతో చేపట్టిన ఈ పథకానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు వాయిదఆల్లో అందించే సాయానికి ఇది అదనమని చెప్పారు. రాష్ట్రప్రభుత్వ పథకంతో కోటి మందికి పైగా రైతులు ప్రయోజనం పొందుతారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.ఆర్థిక మంత్రి కూడా అయిన ఫడ్నవిస్ గతమార్చిలో 2023 24ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు.
- Advertisement -