Wednesday, December 25, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావుకు బెయిల్ ఇచ్చిన కోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న నిందితుడు భుజంగరావుకు బెయిల్ లభించింది. భుజంగరావు బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారించిన నాంపల్లి కోర్లు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అనారోగ్య కారణాలతో 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు.. అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని భుజంగరావును ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2గా ఉన్నారు. ఈ కేసులో మార్చి 23న భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News