Friday, November 15, 2024

కస్టడీకి రాధాకిషన్‌రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మా రిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. విచారణను వేగవంతం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఇప్పటివరకు కేవలం పోలీసు అధికారులపై ఫోకస్ చే సిన ప్రత్యేక వి చారణ బృందం (సిట్) త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తి రుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ రావులను హైదరాబా ద్ పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ వాంగ్మూలం లో బిఆర్‌ఎస్ ముఖ్య నేతలు చెబితేనే ప్రత్యర్థ్ధుల ఫోన్లు టాప్ చేశామని చెబుతున్నారు. ఇదే సమయంలో పలువురు రాజకీయ నేతలు తమ ఫోన్లను టాప్ చేశారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ కేసులో అసలు సూత్రధారులను కనిపెట్టే దిశగా పోలీసుల చర్యలు ముమ్మరమయ్యాయి.ఇదిలా ఉండగా,ఈ కేసులో ఎ4గా చేర్చినటు వంటి టా స్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ రావు కస్టడీ కోరుతూ, పోలీసులు వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారించింది.

రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి ఏడు రోజుల పాటు రాధాకిషన్‌రావును పోలీసులు ప్రశ్నించనున్నారు. రాధాకిషన్ రావు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బుధవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రాధకిషన్‌పై సుదర్శన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గతంలో తనను బెదిరించి తన కూతురు పేరు మీదున్న అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్‌ను రాధాకిషన్ రావుబలవంతంగా రాయించుకున్నడని సుదర్శన్ తన ఫిర్యాదులో తెలిపారు. సుదర్శన్ ఫిర్యాదుపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చిన విషయం విధితమే. ఇదివరకే రాధాకిషన్ రావును విచారించిన పోలీసులు, పలు కీలక విషయాలు రాబట్టారు. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేసినట్లు, రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారంతో పలువురు నాయకుల డబ్బు సీజ్ చేసినట్లు వెల్లడించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News