Sunday, January 19, 2025

ఎంపి అరవింద్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసిన టిఆర్‌ఎస్ కార్యకర్తలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంఎల్‌సి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ టిఆర్‌ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని ఎంపి ధర్మపురి అరవింద్ ఇంటిపై శుక్రవారం దాడి చేశారు.

ఇంట్లోకి వెళ్లి కారు అద్దాలు, ఇంటి అద్దాలను పగుల గొట్టారు. ఎంపి ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్‌కు పంపించింది. నిందితులకు బెయిల్ ఇవ్వాలని న్యాయవాది తిరుపతి కోర్టులో శనివారం పిటీషన్ దాఖలు చేశారు. తిరుపతి వర్మ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News