Thursday, January 23, 2025

రాజాసింగ్ రిమాండ్ ను రిజెక్ట్ చేసిన కోర్టు.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎమ్మేల్యే రాజాసింగ్ రిమాండ్ ను నాంపల్లి కోర్టు రిజెక్టు చేసింది. దాంతోపాటు ఆయనను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, మొదట రాజాసింగ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదని కోర్టు అభిప్రాయపడింది. న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు రిమాండ్ ను తిరస్కరిస్తూ.. రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.

Nampally Court Reject Remand of Raja Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News