ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కోరుతూ భుజంగరావు.. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే, బుధవారం భుజంగరావు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఫోస్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన భుజంగరావుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందాడు. రేపటితో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. దీంతో మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన నాంపల్లి కోర్టు రేపు సాయంత్రం 4 గంటల లోపు..తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
కాగా, బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్షాలపై ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కేసులో పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నలుగురికి మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు.