Friday, December 20, 2024

రాజాసింగ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. 14 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

Nampally Court remand 14 days to MLA Raja Singh

హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎమ్మేల్యే రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. ఈ రోజు పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ సమయంలో నాంపల్లి కోర్టు వద్ద వ్యతిరేక, అనుకూల ఆందోళనకారులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించి ఆందోళనకారులను చదరగొట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజా సింగ్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో జైలుకు వెళ్ళే మార్గంలో, చంచల్ గూడ జైల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Nampally Court remand 14 days to MLA Raja Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News