Wednesday, January 22, 2025

అత్యాచారం కేసులో తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః కన్న కూతురిపై అత్యాచారం చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ నాంపల్లి 12 ఎఎంఎస్‌జే నాంపల్లి కోర్టు గురువారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…బాలిక తల్లి ఓ డిసెంబర్ 12,2022లో ఇంట్లో తల్లిదండ్రుల పక్కన నిద్రించింది. తల్లి ఓ ఆఫీస్‌లో పనిచేస్తుండడంతో ఉదయమే లేచి పనికివెళ్లి పోయింది.

ఇదే అదునుగా భావించిన తండ్రి షేక్ రిజ్వాన్ బాలిక(11) నోరు మూసి అత్యాచారం చేశాడు. బాలిక నోటిని గట్టిగా మూయడంతో అరవలేకపోయింది. తర్వాత నిందితుడు బాలికను బెదిరించాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తల్లికి బాలిక తన కడుపు నొప్పిగా ఉందని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన తల్లి కూతురిని జరిగిన విషయంపై ఆరా తీయడంతో బాలిక మొత్తం విషయం చెప్పింది.

వెంటనే కూతురును తీసుకుని వెళ్లి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టడంతో కోర్టు వాటిని పరిశీలించిన కోర్టు తీర్పు చెప్పింది. డిసిపి కవిత, ఎసిపి ప్రసన్నలక్ష్మి, ఇన్స్‌స్పెక్టర్ జోత్స కేసు దర్యాప్తును పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News