మనతెలంగాణ, సిటిబ్యూరోః కూతురు వరుసైన బాలికపై అత్యాచారం చేసిన మరు తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మంగళవారం తీర్పు చెప్పింది. న్యూబోయిన్‌పల్లి, హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న గుడిసెలకు చెందిన రమావత్ రమేష్ చెత్తసేకరించే పనిచేసేవాడు. బాలిక తల్లికి రమేష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. రమేష్ అంతకు ముందే సరోజతో వివాహం జరిగింది.
ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత బాలిక తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. బాలిక తల్లితోపాటు గుడిసెలో నివసిస్తున్నాడు. బాలిక తల్లీకి గతంలో మొదటి భర్త ద్వారా కలిగిన సంతానంతో కలిసి రమేష్‌తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే మార్చి 16,2022న రాత్రి 11గంటలకు నిద్రిస్తున్న బాలికపై అత్చాచారం చేసేందుకు యత్నించాడు. వద్దు డాడి అని బాలిక అరవడంతో వెంటనే తల్లి లేచింది.
భార్య లేచింది గమనించిన రమేష్ అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత తల్లికి గతంలో తనపై మరుతండ్రి చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది. తనను బెదిరించి గతంలో రెండు, మూడు సార్లు అత్యచారం చేశాడని చెప్పింది. వెంటనే బాలిక తల్లి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అప్పటి ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్ దర్యాప్తు చేసి కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.