Sunday, December 22, 2024

పోక్సో కేసులో నిందితుడికి జైవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాలికపై ఆమె తండ్రి మే, 15, 2022న అత్యాచారం చేశాడు. నిందితుడికి ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. ఇందులో బాలిక రెండో సంతానం, బాలిక అన్నలతో కలిసి వేరే గదిలో కలిసి నిద్రిస్తోంది. అదే సమయంలో బాలిక తండ్రి వచ్చి అత్యాచారం చేశాడు.

బాలిక గాఢ నిద్రలో ఉండడంతో గుర్తించలేదు. దీనిని అడ్వాన్‌టేజ్‌గా తీసుకున్న నిందితుడు 18, మే,2022న మరోసారి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని బెదిరించాడు. తర్వాత బాలిక తల్లికి చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్షాలను సేకరించిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News