Sunday, December 22, 2024

అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అర్ధరాత్రి నగర రోడ్లపై అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తికి నాంపల్లి కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…ముషీరబాద్‌కు చెందిన వినోద్‌కుమార్(36) మొహానికి ముసుగు కట్టుకుని అర్ధరాత్రి రోడ్లపై అనుమానస్పదంగా తిరుగుతున్నాడు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ముషీరాబాద్ పోలీసులు ఆపి వివరాలు అడుగగా సరిగా చెప్పలేదు.దీంతో పోలీస్ స్టేషన్‌కు తరలించి పూర్తిగా విచారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. పరిశీలించిన కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News