Wednesday, January 8, 2025

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమ్మన్లు

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 12న కోర్టు ముందు హాజరు కావాలని తాకీదు

హైదరాబాద్: నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు గురువారం సమ్మన్లు జారీ చేసింది. కొండా సురేఖ అక్టోబర్ 3న నాగచైతన్య, సమంతకు విడాకులు ఇవ్వడానికి  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు కూడా కారణం అన్నారు. దీంతో నాగార్జున ఆమెపై క్రిమినల్ డిఫేమేషన్ కేసు వేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబ పరువు తీశాయని నటుడు నాగార్జున కోర్టుకు తెలుపుకున్నారు.

‘‘ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కెటిఆర్ కోరారని, దానివల్ల అతడే నాగచైతన్య, సమంత విడాకులకు కారణం. కెటిఆర్ వద్దకు వెళ్లాలని సమంతను నాగార్జున బలవంతపెట్టాడు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో వారు ఆమెను వెళ్లిపొమ్మన్నారు. ఈ కారణంగానే విడాకులు చోటుచేసుకున్నాయి’’ అని కొండా సురేఖ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News