Wednesday, January 22, 2025

రేపటి నుంచే నుమాయిష్.. మాస్క్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సోమవారంనుంచి నుమాయిష్ ప్రారంభమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. ఈ ఏడాది 2400 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ గల అనేకమంది వ్యాపారులు ఎగ్జిబిషన్ లో స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. జనవరి 1నుంచి ఫిబ్రవరి 15వరకూ నుమాయిష్ కొనసాగుతుంది. కరోనా ప్రభావం ఉన్నందున ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఫైర్, హెల్త్, శానిటేషన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News