Thursday, January 23, 2025

జనవరి 1 నుంచి నుమాయిష్ ప్రారంభం…. టికెట్ రేటు ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లిలోని జనవరి 1 నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఆల్ ఇండియా ఇండిస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. 83వ నుమాయిష్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 15 వరకు నుమాయిస్‌లో స్టాల్స్ ఉంటాయి, అంటే 45 రోజుల వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఏర్పాటు చేయనున్నారు. దేశం నలుమూలాల నుంచి వచ్చిన వ్యాపారాలు 2400 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట అన్నిరకాల వస్తువులు అందుబాటులో ఉండడంతో నగరవాసులు బారులు తీరుతారు. దుస్తులు, వంట సామాగ్రి, దుప్పట్లు, మంచాలు, బెడ్‌షీట్లు, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త ఫర్నిచర్, మల్టీ పర్సస్ ఉపకరణాలు అందుబాటులో ఉంటాయి. ఎగ్జిబిషన్‌లో ఎంట్రీ ఫీజు 40 రూపాయలుగా నిర్ణయించారు. ఎగ్జిబిషన్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతామని, క్రీడా పోటీలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. 22 లక్షల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News