Wednesday, January 22, 2025

వేర్వేరు కేసుల్లో ఇద్దరికి జైలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు శిక్ష విధిస్తూ నిందితులకు నాంపల్లి ఆరవ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్.లక్ష్మణరావు సోమవారం తీర్పు చెప్పారు. బహదుర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే జావీద్ పంజేషా వద్ద పాన్ షాపును నిర్వహిస్తున్నాడు. అర్దరాత్రి దాటిన తర్వాత కూడా షాపును అలాగే కొనసాగిస్తుండడంతో ఆ ప్రాంతంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా నిర్వహిస్తున్నాడు. దీంతో పోలీసులు జావీద్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు.

నాంపల్లి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. మరో కేసులో మొహ్మద్ హసీబుర్రహ్మన్ యాకత్‌పుర వద్ద ఉన్న తన ఇంటి వద్ద ఈ నెల 1వ తేదీన డ్రైనేజీ మరమ్మత్తు కోసం సెప్టిక్ ట్యాంక్‌తో క్లీనింగ్ చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే పక్క ఇంటిలో ఉంటున్న మహ్మద్ ఒమేర్ ఎంతసేపు బండిని ఇక్కడ నిలుపుతావు అని వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా హసీబుర్రహ్మాన్‌పై దాడికి దిగాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చగా మూడు రోజుల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News