Sunday, December 22, 2024

లిల్‌ గుడ్‌నెస్‌ బ్రాండ్ అంబాసిడర్ గా నమత్రా శిరోద్కర్‌, సితార..

- Advertisement -
- Advertisement -

Namrata Shirodkar and Sitara brand ambassador of Lil Goodness

ముంబై: కుటుంబాల కోసం వినోదాత్మక, గుడ్‌ ఫర్‌ యు స్నాకింగ్‌ బ్రాండ్‌, లిల్‌ గుడ్‌నెస్‌ ఇప్పుడు మాజీ మిస్‌ ఇండియా, బాలీవుడ్‌ నటి నమ్రతా శిరోద్కర్‌, ఆమె కుమార్తె సితారతో ప్రత్యేకంగా బ్రాండ్‌ భాగస్వామ్యం చేసుకుంది. గుడ్‌ నెస్‌ అంబాసిడర్స్‌గా నమ్రత, సితారలు లిల్‌ గుడ్‌నెస్‌ కు పలు డిజిటల్‌ వేదికలపై ప్రచారం చేయడంతో పాటుగా మంచి ఆహారం, పోషకాహారం ద్వారా పిల్లలు, యుక్తవయస్కులు ఉన్న కుటుంబాలు మంచితనం యొక్క శక్తిని అనుభవించాల్సిందిగా ప్రోత్సహించనున్నారు.

లిల్‌ గుడ్‌ నెస్‌ సీఈఓ, కో–ఫౌండర్‌ హర్షవర్ధన్‌ ఎస్‌ మాట్లాడుతూ ‘‘చిన్నారులు కలిగిన కుటుంబాలలో మంచి పౌష్టికాహారంకు ఎలా పరిచయం చేయబడతారో తెలిపే మా ప్రయాణంలో సమూలమైన మార్పును తీసుకురావడానికి నమ్రత మరియు సితారలు మా బోర్డ్‌పైకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. సితారకు మాతృమూర్తిగా నమ్రత యొక్క సొంత అనుభవాలు, ఈ బ్రాండ్‌ యొక్క కీలకమైన సందేశం అయిన వినోదం, పౌష్టికాహార స్నాకింగ్‌ను భారతదేశ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు చేరువచేయనున్నారు’’ అని అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి నమ్రత శిరోద్కర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు పిల్లల తల్లిగా, మరీ ముఖ్యంగా ఎదుగుతున్న వయసు పిల్లల తల్లిగా తరచుగా నేను వారు తినడానికి ఇష్టపడే ఆహారం అందించడానికి తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటుంటాను. అదే సమయంలో వారికి చక్కటి పౌష్టికాహారం అందించడానికి తగిన భరోసా అందిస్తుంటాను. మా పిల్లలు లిల్‌ గుడ్‌నెస్‌ స్నాక్స్‌ తీసుకున్నప్పుడు వారు వెంటనే వాటితో ప్రేమలో పడిపోయారు. మిల్క్‌ చాక్లొట్స్‌ను సితార అమితంగా ప్రేమిస్తుంది, అలాగే సూపర్‌ గ్రెయిన్‌ పఫ్స్‌ను సైతం అమితంగా ఇష్టపడుతుంది. ప్రీ బయాటిక్‌ చాక్లొట్స్‌ను, అలాగే సూపర్‌ గ్రెయిన్‌ పఫ్స్‌ను సితార అమితంగా ఇష్టపడుతుండటం నాకు ఆనందంగా ఉంది. ఇవి ఆరోగ్యవంతమైన పదార్థాలను కలిగి ఉన్నాయి. నాలాంటి ఎంతోమంది తల్లులు మాత్రమే కాదు తండ్రుల సమస్యలకు తగిన పరిష్కారాన్ని లిల్‌ గుడ్‌నెస్‌ అందిస్తుంది. ఎందుకంటే పిల్లలకు నచ్చే రుచిలో చక్కటి పౌష్టకాహారం సైతం అందిస్తుంది.

Namrata Shirodkar and Sitara brand ambassador of Lil Goodness

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News