Monday, December 23, 2024

కుర్రాడి చెంప చెళ్లుమనిపించిన నానా పటేకర్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఓ కుర్రాడి చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నానాకు ఇదేం పోయేకాలమంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే… నానా పటేకర్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇంతలో ఓ యువకుడు ఎదురుగా వచ్చి, సెల్ఫీ కోసం రిక్వెస్ట్ చేశాడు. దాంతో ఏమైందో ఏమో గానీ, నానా అతన్ని కొట్టి, బయటకు పొమ్మన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నానా వైఖరిపై మండిపడుతున్నారు. దీంతో ఆయన వివరణ ఇస్తూ, ఓ వీడియో విడుదల చేశారు.

“నిజానికి కుర్రాణ్ని నేను కొట్టడం షూటింగులో భాగమే. మొదట ఒకసారి రిహార్సల్ చేశాం. రెండోసారి చేయాల్సి ఉంది. ఈలోగా ఓ కుర్రాడు వచ్చి సెల్ఫీ అడిగాడు. షూటింగ్ లో భాగంగానే అతను వచ్చి అడిగాడని భావించి, సీన్ లో ఉన్నట్టుగానే అతన్ని కొట్టి బయటకు పొమ్మన్నాను. అయితే, అతను షూటింగ్ సిబ్బందికి చెందినవాడు కాదని తెలిసి, అతన్ని వెంటనే పిలవమని చెప్పాను. కానీ అప్పటికే ఆ కుర్రాడు వెళ్లిపోయాడు. బహుశా, ఆ కుర్రాడి ఫ్రెండ్ ఈ వీడియో తీసి, వైరల్ చేసినట్లున్నాడు. నిజానికి నా దగ్గరకు సెల్ఫీ కోసం వచ్చేవారని నేను నిరుత్సాహపరచను. ఈసారి పొరపాటు జరిగింది. క్షమించండి” అంటూ ఆ వీడియోలో నానా వివరణ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News