Sunday, January 19, 2025

వారి భేటీపై “ఇండియా” సమావేశాల్లో చర్చిస్తారు: పటోల్

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ పవార్ మధ్య ఇటీవల జరిగిన భేటీపై విపక్ష కూటమి ఇండియా సమావేశాల్లో చర్చిస్తారని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ గురువారం వెల్లడించారు. శరద్ పవార్ విషయమై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, ప్రజల్లోనే ఇది కనిపిస్తోందని చెప్పారు. ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) బీజేపీతో పొత్తు పెట్టుకుంటే శివసేన (యుబిటి), కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ‘ప్లాన్ బి’ సిద్ధమైందన్న ఊహాగానాలను పటోల్ తోసిపుచ్చారు.

ఎంపిసిసి కోర్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తరఫున ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారని, ఈ సమావేశంలో విపక్షకూటమి ఇండియా సమావేశం ఏర్పాట్ల పైన, యాంటీ బిజేపి పార్టీలను ఏకం చేయడం పైన చర్చలు జరిగినట్టు చెప్పారు. సెప్టెంబర్ 3 నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలతో ప్రారంభం కానున్న పాదయాత్రపై కూడా చర్చించినట్టు చెప్పారు. విపక్ష కూటమి ఇండియా సమావేశాలు ఈనెల 31న, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ముంబైలో జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News