Thursday, January 23, 2025

పెళ్లి పందిట్లో వరుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుంటుండగా ప్రియురాలు పెళ్లి మండపానికి వచ్చి అతడిపై యాసిడ్, కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించింది. ప్రియుడు ఆమెను అదే కత్తితో పొడిచాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా నందలూరులో జరిగింది. ప్రియురాలు తెలిపిన వివరాల ప్రకారం… తిరుపతి చెందిన యువతి, రైల్వే కోడూరు చెందిన భాషతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భాషా కనిపించకపోవడంతో అతడి కోసం ఆమె రైల్వే కోడూరుకు వెళ్లి ఆరా తీసింది. అతడు నందలూరులో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆమె అక్కడికి వెళ్లింది.

పెళ్లి మండపానికి వెళ్లి భాషాపై యాసిడ్‌తో పాటు కత్తితో ప్రియురాలు దాడి చేసింది. యాసిడ్ అతడి బంధువుపై పడడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రియురాలి చేతిలో ఉన్న కత్తిని భాషా లాక్కొని ఆమెను రెండు సార్లు పొడిచాడు. ప్రియుడు, ప్రియురాలు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ప్రాణాపాయంలేదని వైద్యులు వెల్లడించారు. వధువు తల్లిదండ్రులు తమ కూతురుకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలు మీడియాతో మాట్లాడకుండా ఆమెను పోలీసులు ఒక గదిలో బంధించారని ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News