Friday, December 20, 2024

కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న నందమూరి సుహాసిని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అటు కారు దిగడం.. ఇటు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎంపీ అభ్యర్థులుగా ప్రకటన తర్వాత కూడా కాంగ్రెస్‌లో చేరిపోతుండటం గమనార్హం. శనివారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు బీఆర్ఎస్‌కు బై బై చెప్పేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం హస్తం గూటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇదే క్రమంలో నందమూరి సుహాసిని కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రేవంత్‌కు సుహాసిని పుష్పగుచ్చం అందజేశారు. ఈమెతో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని ఫిక్స్ అయిన తర్వాతే ఈ భేటీ జరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Nandamoori Suhasini 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News