Thursday, December 5, 2024

‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’

- Advertisement -
- Advertisement -

లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ అద్భుతమైన నటనతో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1991 సైన్స్ ఫిక్షన్ మూవీ ’ఆదిత్య 369’. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్. అయితే శుక్రవారం ప్రసారం కానున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్ సందర్భంగా బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్‌ను ప్రకటించారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సీక్వెల్ రానుంది. ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ లీడ్ రోల్ లో నటించనున్నారు. బాలకృష్ణ స్క్రిప్ట్‌లో నిమగ్నమై ఉన్నారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె అప్ కమింగ్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ తన ఆదిత్య 369 అవతార్‌లో కనిపిస్తారు. సీక్వెల్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడంతో పాటు ఆదిత్య 999 మ్యాక్స్ మేకింగ్ సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ అందిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News