- Advertisement -
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో భజ్రంగ్ పునియా కాంస్యం సాధించడం దేశానికే గర్వకారణమని హిందుపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. కజకిస్థాన్ రెజ్లర్ నియాజ్ బెకోవ్పై 80 తేడాతో భజ్రంగ్ సాధించిన విజయం హర్షణీయం. కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి దేశానికి ఆరో పథకం అందించిన భజరంగ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని పథకాలు సాధించాలని, దేశం మరింగ గర్వించేలా చేయాలని కోరుకుంటున్నానని నందమూరి బాలకృష్ణ తెలిపారు.
Nandamuri Balakrishna congratulates Bajrang Punia
- Advertisement -