Monday, December 23, 2024

భోగి సంబరాల్లో నందమూరి బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: ప్రముఖ సినీనటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు చిత్తూరులోని నారావారిపల్లిలో భోగి పండుగను జరుపుకుని ఇతరులతో ఆనందాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ ఇటీవల నటించిన వీరసింహారెడ్డి చిత్రం మంచి విజయం సాధించి,బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మంచి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా, అభివృద్ధి చెందాలని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

బాలకృష్ణ అభిమానులు, గ్రామస్థులు నాయుడు నివాసం వద్దకు చేరుకుని జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన నివాసం నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ వారితో సెల్ఫీలు దిగారు. గ్రామస్తులు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News