Monday, March 3, 2025

యువగళం పాదయాత్రలో బాలయ్య సందడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నందమూరి బాలకృష్ణతో కలిసి యువగళం పాదయాత్ర సాగింది. ఇద్దరు రాజకీయ ప్రముఖులను కలిసి చూసేందుకు అభిమానులు దారిపొడువునా బారులు తీరారు. బాలకృష్ణ క్యాప్ ధరించి యాత్రలో ఉత్సాహంగా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. బాలయ్యతో సెల్ఫీలు దిగేందుకు టీడీపీ అభిమానులు ఉత్సాహం చూపారు.

పాదయాత్రకు ముందు బాలకృష్ణకు పూలతో ఘనస్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర సాగుతున్న కొద్దీ ఉత్సాహం పెరిగుతోందని టిడిపి శ్రేణులు అంటున్నారు. ముర్తాడు కెనాల్ వద్ద స్థానికుల సమస్యలపై లోకేష్ చర్చించారు. లోకేష్ బూదేడు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News