Wednesday, February 19, 2025

ఎపిలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి : నందమూరి బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని మరింత విస్తరిస్తామని ఆస్పత్రి ఛైర్మన్, హిందూపురం ఎంఎల్‌ఎ బాలకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా ఎపిలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారన్నారు.

ఇప్పటివరకూ 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని, ఆర్థిక స్థోమత లేని వారికి వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బసవతారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ స్థాపించామని, దీనికి ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో తోడ్పడాలని పిలుపునిచ్చారు. అవగాహనతో క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందరూ కలిసి క్యాన్సర్‌పై పోరాటం చేద్దామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News