Monday, December 23, 2024

నందమూరు కుటుంబంలో మరో రోడ్డు ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో హరి కృష్ణ, ఆయన కుమారుడు, సోదరుడు గతంలో చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లో కారు నడుపుకుంటూ వెళ్తుండగా అదుపతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు ముందుబాగం దెబ్బతింది. వెంటనే రామకృష్ణ కారులో నుంచి దిగి వెళ్లిపోయాడు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు వచ్చి కారును తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. తాజాగా నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడికి ప్రథమ చికిత్స చేసి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తారకరత్నను రామకృష్ణ పరామర్శించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News