Monday, December 23, 2024

చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు కోల్పోతున్నారు: నందమూరి రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వార్త విని కొందరు ప్రాణాలు కోల్పోయారని నందమూరి రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు కోసం ప్రాణాలు కోల్పోయిన వార్తలు విని గుండె తరుక్కుపోతుందని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రామకృష్ణ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అన్యాయంపై పోరాడేందుకు తెలుగు వారంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్, బెంగళూరు, డల్లాస్ లో ఐటి ఉద్యోగులు నిరసన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News