Monday, December 23, 2024

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి తెలంగాణ రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ మరో ముగ్గురికి నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు. తెలుగు మహిళా విభాగానికి కొత్త అధ్యక్షురాలిని ప్రకటించారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని (కూకట్‌పల్లి), రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్‌నాయుడు (కొల్లాపూర్), రాష్ట్ర కార్యదర్శిగా బి.విఠల్ (బాన్సువాడ)ను నియమించారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా షకీలారెడ్డి (ఖైరతాబాద్), జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా కరాటే రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

పంట నష్టంపై సిఎం స్పందించాలి..
మార్చి నెలలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2,28,250 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8865 ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కర్భూజ, కూరగాయలు వంటివి 17,235 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నష్టం అధికంగా జరిగిందన్నారు. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా పంట నష్టాలు జరిగాయి. తరువాత సూర్యాపేట, కరీంనగర్, జనగామ, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో పంటల నష్ట తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ ప్రతి ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News