Wednesday, January 22, 2025

యువగళం పాదయాత్రలో నందమూరి తారకత్నకు తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

కుప్పంలో నారా లోకేష్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకత్న తీవ్ర అస్వస్థతకు గురై సృహతప్పి వాహనం పైనుంచి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర మొదలైంది.

అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు చేశారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో ఆ తాకిడికి తారకరత్న సృహతప్పి పడిపోయారు. కుప్పంలోని కెసి ఆసుపత్రికి తారకత్నను తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News