Sunday, December 22, 2024

‘నందనందనా..’ సాంగ్ వచ్చేసింది.. విజయ్, మృణాల్ ల కెమిస్ట్రీ అదుర్స్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నుంచి బుధవారం ఫస్ట్ సింగిల్ ’నందనందనా..’ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మెలోడీ సాంగ్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల సూపర్ హిట్ మూవీ ‘గీత గోవిందం‘లో చార్ట్‌బస్టర్ సాంగ్ ’ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…’కు వర్క్ చేసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో రూపొందిన ’నందనందనా..’ సాంగ్ ప్రోమోకు సూపర్ రెస్పాన్స్ రావడంతో.. ఈ సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ ఎదురుచూశారు. తాజాగా విడుదలైన ఈ మెలోడీ సాంగ్స్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

‘ఫ్యామిలీ స్టార్‘ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్‘ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News