Wednesday, January 22, 2025

దుబాయ్‌లో టిఎఫ్‌సిసి నంది అవార్డ్ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ‘టిఎఫ్‌సిసి నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023’ వేడుకను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డా.ప్రతాని రామకృష్ణ గౌడ్. ఇందులో భాగంగా డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, టి ‘మా’ ప్రెసిడెంట్, మిస్ ఏషియా రష్మి ఠాకూర్ దుబాయ్ వెళ్లి షేక్ అబు సలీంని కలిశారు. ఈ సందర్భంగా డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “టిఎఫ్‌సిసి నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023 వేడుక కోసం దుబాయ్ వచ్చి షేక్ అబు సలీంను కలిశాము.

జూలై నెలాఖరున లేదా ఆగస్టు మొదటి వారంలో కానీ అవార్డ్ ప్లాన్ చేసుకోమని ఆయన అన్నారు. ఈ వేడుకకు దుబాయ్ ప్రిన్స్, కేరళ సిఎం, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, బాలీవుడ్ నుంచి జాకీష్రాఫ్, జితేంద్రలను ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ వేడుకలో సన్నీలియాన్, ముమైత్ ఖాన్ డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ చేయనున్నారు. తెలుగు హీరోలు మంచు విష్ణు, శ్రీకాంత్, శివాజీ రాజా సహా చాలా మంది ఆర్టిస్టులు సపోర్ట్ చేస్తున్నారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News