Monday, December 23, 2024

ఉగాది నాటికి నంది అవార్డులు

- Advertisement -
- Advertisement -

పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డులను ఇస్తాం
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  నంది అవార్డులపై రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు అందివ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి పేరు వస్తుందన్నారు. ఉగాది నాటికి నంది అవార్డులను ఇచ్చేలా పరిశీలిస్తామన్నారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులను ఇస్తామన్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం సినీ పెద్దలను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నటసింహ చక్రవర్తి బిరుదుతో మురళీమోహన్‌ను సత్కరించారు. అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులు ప్రశ్నార్థకమయ్యాయన్నారు. జగన్ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వలేదని, కెసిఆర్ సింహా అవార్డుల పేరు ఇస్తామని చెప్పినా ఇవ్వలేకపోయారన్నారు. సినిమా, టివి, నాటకరంగాలకు అవార్డులు ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనైనా నంది అవార్డులు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. రేవంత్‌రెడ్డిని కలిసి అవార్డులపై విన్నవిస్తామన్నారు. 2024లో నంది అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే సత్కారం కోసం వేచిచూస్తామన్నారు. సినీ పరిశ్రమను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News