Monday, December 23, 2024

ఇంటిని ఖాళీ చేయించినందుకు కడతేడ్చాడు..

- Advertisement -
- Advertisement -

నందిగామ: జీవనోపాధికోసం బీహార్ నుంచి నందిగామ వలస వచ్చాడు.. అద్దెకు ఇంటిని తీసుకొని పరిశ్రమలో పనికి కుదిరాడు. నిత్యం భార్యతో గొడవ పడుతుండడంతో ఇంటి యజమాని వారించి సముదాయించేది. నిత్యం జరుగుతున్న గొడవకు విసుగు చెందిన ఇంటి యజమాని (వృద్ధ మహిళ) ఇంటిని ఖాళీ చేయించింది. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకొని అర్ధరాత్రి అత్యంత పాశవికంగా ఓ చిన్నారితోపాటు వృద్ధ మహిళను కడతేర్చిన జంట హత్యల కేసును నందిగామ పోలీసులు చేధించారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామకు చెందిన వృద్ధ మహిళ పార్వతమ్మ(65) అంగన్‌వాడీలో ఆయా పని చేస్తూ తన మనవరాలు భానుప్రియ(౦9)తో కలిసి జీవిస్తుందన్నారు.

ఈ నేపథ్యంలో బీహార్‌కు చెందిన దివాకర్ సాహూ తన భార్య అంజలితో కలిసి పార్వతమ్మ ఇంట్లో ఐదు నెలల నుంచి అద్దెకు ఉంటుంన్నారన్నారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారని, పార్వతమ్మ ఇందరిని మందలిస్తూ సముదాయిస్తుండే దన్నారు. ఎంతకూ వినక పోవడంతో ఇంటిని ఖాళీ చేయించిందని, ఇది మనస్సులో పెట్టుకున్న దివాకర్‌సాహూ పార్వతమ్మ ఒంటిపై ఉన్న బంగారం, ఆమె వద్ద ఉన్న నగదుపై కన్నేసి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో గోడ దూకి పార్వతమ్మ ఇంటి వద్దకు వెళ్లి పార్వతమ్మ గొంతుకోసి ఇటుకతో మోది చంపాడు. ఇది చూసిన భానుప్రియ అరవడంతో నింధితుడు చిన్నారి గొంతు కోశాడు.

పార్వతమ్మ ఇంటికి కొద్ది దూరంలో నివాసం ఉండే ఆమె కుమార్తె శశికళ తన కుమార్తె భానుప్రియ ఉదయం నుంచి కనిపించడంలేదని ఇంటికి వెళ్లి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారని వివరించారు. సమాచారం అందుకున్న నందిగామ సీఐ రామయ్య తన సిబ్బందితో అక్కడకు వెళ్లి సంఘటన స్థలంలో క్లూస్‌టీం, డాగ్ స్కాడ్‌తో పరిశీలించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు దివాకర్‌సాహును అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఏసీపీ భాస్కర్, సీఐ రామయ్య, ఎస్‌ఓటీ సీఐ సత్యనారాయణ, నందిగామ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News