Monday, December 23, 2024

మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా గెలుచుకుంది. మొదటి రన్నర్‌గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజ, రెండో రన్నరప్‌గా మణిపూర్ కు చెందిన తౌనోజాబ్ స్ట్రెలా లువాంగ్ నిలిచారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీలో పాల్గొనగా, ఈ ముగ్గురు మొదటి మూడు స్థానాల్లో ఎంపికయ్యారు.

2024 ప్రపంచ అందాల పోటీల్లో భారత్ తరఫున పాల్గొననున్న కర్ణాటకకు చెందిన మాజీ ఫెమినా మిస్ ఇండియా 2022 విజేత సినీశెట్టి నుంచి నందిని కిరీటాన్ని ధరించారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన మాజీ మిస్ ఇండియా 1వ, 2వ రన్నరప్ రూబల్ షెకావత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్‌లు వరుసగా శ్రేయా, తౌనోజామ్‌లకు కిరీటం ధరింప చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News