Monday, December 23, 2024

నాన్న నేను తప్పు చేయలేదు… అమ్మా క్షమించు… చనిపోతున్నా: బిటెక్ విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

అమరావతి:”నేను ఏ తప్పు చేయలేదు నాన్న, అమ్మలా భావించే అన్న ఫోన్ చేస్తే, తప్పు చేశామని నిలదీసినందుకు చనిపోతున్నా” అని లేఖ రాసి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డోన్‌లో జక్కి గౌరప్ప- రామేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు రేణుక ఎల్లమ్మ(22) మాచర్లలో న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కాలేజీలో క్లాస్‌మేట్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు మధ్య అన్నాచెల్లెలు అనుబంధం ఉంది. అతడు రేణుకకు ఫోన్ చేశాడు స్పందించకపోవడంతో ఆమె తండ్రి ఫోన్ చేసి అడిగాడు. దీంతో కన్నతండ్రి కూతురుకు ఫోన్ చేసి నిలదీశాడు. రేపు కాలేజీకి వచ్చి కూతురు సంగతి తేలుస్తానని చెప్పడంతో ఆమె మనస్థాపానికి గురైంది. రేణుక ఎంత చెప్పిన తండ్రి వినలేదు. కన్న తండ్రి కాలేజీకి వస్తే తన పరువు పోతుందని ఆమె భావించింది. “నాన్న నీ పరువు తీసే ఏం పని నేను చేయలేదు, నేను తప్పు చేశాను అనుకుంటే ఈ రోజు చివరి రోజు, ఒకవేళ తప్పు చేశాను అనుకుంటే నువ్వు నా చదువు ఆపినా నేను బ్రతకను, నాన్న నువ్వే నా ధైర్యం, నువ్వే నమ్మకుంటే నన్ను ఎవరు నమ్ముతారు, అమ్మ నన్ను క్షమించు, ఆ అన్న నన్ను అమ్మలా భావిస్తాడు, నేను చనిపోతున్నా సారీ నాన్న” అని సూసైడ్ లేఖ రాసి తన వసతి గృహంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని రేణుక ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News