- Advertisement -
విశాఖపట్నం: మంగళవారం వానలు పడతాయని ఫోర్ కాస్ట్ చెప్పినప్పటికీ నంద్యాలలో సోమవారం 46 డిగ్రీల వేడిమి జనులను చిర్రెత్తించింది. కడప, కర్నూల్, ఆరోగ్యవరం లలో కూడా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. ఇక విశాఖపట్నం, కళింగపట్నం, శ్రీకాకుళం లలో ఉష్ణోగ్రత గతం కంటే కాస్త చల్లబడింది.
భారత వాతావరణ శాఖ(ఐఎండి) రాయలసీమలో తేలికపాటి వానలు కురిసినట్టు పేర్కొంది. కానీ అది అంత ప్రభావం చూపేది కాదు. ఉష్ణోగ్రతం ఇప్పటికీ వేడిగానే ఉందక్కడ. చింతపల్లి, పార్వతీపురం లలో కడగండ్ల వాన కురిసింది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో మంగళవారం భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండి తెలిపింది. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వానలు పడనున్నాయని తెలిపింది.
- Advertisement -