Monday, December 23, 2024

నంద్యాలలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సికింద్రాబాద్ లోని వెంకటాపురం ప్రాంతానికి చెందిన రవీంద్ర కుటుంబం అని పోలీసులు వెల్లడించారు. రవీందర్ తన కుమారుడికి ఈ మధ్యనే పెళ్లి చేయడంతో నవ దంపతులను తీసుకొని తిరుమలకు వెళ్లినట్టు సమాచారం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ అంతరాయం కాకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News