Saturday, June 29, 2024

ఆళ్లగడ్డలో టిడిపి నేత భార్య హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేత ఎవి భాస్కర్ రెడ్డి- శ్రీదేవి అనే దంపతులపై పై ప్రత్యర్థులు దాడి చేయడంతో భార్య మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆళ్లగడ్డలో భాస్కర్ రెడ్డి, శ్రీదేవిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీదేవి ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిడిపి ఎంఎల్‌ఎ భూమా అఖిల ప్రియ ఆస్పత్రికి చేరుకొని శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైసిపి కార్యకర్తలు ఈ దారుణానికి పాల్పడ్డారని టిడిపి కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News