- Advertisement -
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ’దసరా’. ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో ఆయన కనబడబోతున్నారు. అయితే విలక్షణమైన కథలను ప్రయత్నించే నాని తన మైల్ స్టోన్ 30వ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘నాని 30 వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1’గా ఇది రూపొందబోతుంది. మోహన్ చెరుకూరి (సివిఎం) తన స్నేహితులు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్‌లు ఈ బ్యానర్‌ను ప్రారంభించారు. మేకర్స్ జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు నాని 30 వరల్డ్‌ని ఆవిష్కరిస్తారు.
- Advertisement -