Saturday, December 21, 2024

నాని 30వ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ టైటిల్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇది నాని 30వ సినిమా. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కొద్దిసేపటిక్రితం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్ విడుదల చేసింది.ఈ చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ వీడియో చూస్తుంటే ఫీల్ గుడ్ సినిమాగా రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ టైటిల్ గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Also Read: పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News