Friday, December 20, 2024

31న నాని 30 ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని 30వ చిత్రం వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందనుంది. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్‌ని కూడా మేకర్స్ చూపించారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం జనవరి 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News